Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

సదుంలో ప్రారంభానికి సిద్ధమైన 36 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సదుంలో ప్రారంభానికి సిద్ధమైన 36 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం

వార్త ముఖ్యాంశాలు

  • సదుం: సదుం పరిధిలోని పుణ్యపావన గార్గేయ నదీ తీరాన వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 36 అడుగుల భారీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.
  • దాదాపు ఆరు నెలల పాటు శ్రమించి చేపట్టిన విగ్రహ నిర్మాణం ఇటీవల పూర్తి కావడంతో పాటు, ఆకర్షణీయమైన స్వర్ణ వర్ణపు రంగులు అద్దడంతో స్వామివారి రూపం అత్యంత దేదీప్యమానంగా దర్శనమిస్తోంది.
  • ​ఈ మహా విగ్రహాన్ని రాబోయే పవిత్ర కార్తీక మాసంలో శాస్త్రోక్తంగా, విశేష పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు.

సదుం:
సదుం పరిధిలోని పుణ్యపావన గార్గేయ నదీ తీరాన వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 36 అడుగుల భారీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. దాదాపు ఆరు నెలల పాటు శ్రమించి చేపట్టిన విగ్రహ నిర్మాణం ఇటీవల పూర్తి కావడంతో పాటు, ఆకర్షణీయమైన స్వర్ణ వర్ణపు రంగులు అద్దడంతో స్వామివారి రూపం అత్యంత దేదీప్యమానంగా దర్శనమిస్తోంది.
​ఈ మహా విగ్రహాన్ని రాబోయే పవిత్ర కార్తీక మాసంలో శాస్త్రోక్తంగా, విశేష పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు. ఆ సమయంలో ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, కుంభాభిషేక పూజలు వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *