Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

టిడిపి జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి అధ్యక్షతన కోనసీమ శాసనసభ్యులు, ఇంచార్జ్ ల ఆత్మీయ సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టిడిపి జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి అధ్యక్షతన కోనసీమ శాసనసభ్యులు, ఇంచార్జ్ ల ఆత్మీయ సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • *అమలాపురం:* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఇంచార్జ్ లు, కో-కన్వీనర్ల ఆగస్టు నెల ఆత్మీయ సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి అధ్యక్షతన 16/08/2026 ఆదివారం అమలాపురం కాటన్ గెస్ట్ హౌస్ నందు జరిగింది.
  • ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు.
  • పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద కొత్త కార్డులను వెంటనే జారీ చేయాలని, వి.బి.ఆర్.ఎ.ఎం-ఎన్.ఆర్.ఇ.జి.ఇ.ఎస్ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రోడ్ల పనులు ఆపకుండా అదనంగా నిధులు కేటాయించి కొత్త రోడ్లు వేయాలని తీర్మానించారు.

*అమలాపురం:* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఇంచార్జ్ లు, కో-కన్వీనర్ల ఆగస్టు నెల ఆత్మీయ సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి అధ్యక్షతన 16/08/2026 ఆదివారం అమలాపురం కాటన్ గెస్ట్ హౌస్ నందు జరిగింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద కొత్త కార్డులను వెంటనే జారీ చేయాలని, వి.బి.ఆర్.ఎ.ఎం-ఎన్.ఆర్.ఇ.జి.ఇ.ఎస్ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రోడ్ల పనులు ఆపకుండా అదనంగా నిధులు కేటాయించి కొత్త రోడ్లు వేయాలని తీర్మానించారు. పార్టీ నిర్వహిస్తున్న డి2డి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రజలు ఎక్కువగా కోరుతున్న కొత్త పెన్షన్లు, పక్కా గృహాల నిర్మాణం, 2014-19 మధ్య కట్టుకున్న ఇళ్ల బిల్లులు వెంటనే అమలు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. జిల్లా పార్టీ సూచన మేరకు గన్నవరం నియోజకవర్గానికి ఇంచార్జ్ నియామకం త్వరగా చేయాలని కూడా తీర్మానించారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు వాసంశెట్టి సుభాష్, అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, మండపేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరావు, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానంద రావు, రాజోలు ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య, గన్నవరం నియోజకవర్గ కన్వీనర్లు మోకా ఆనందసాగర్, దాసరి వీర వెంకట సత్యనారాయణ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *