Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

విశిష్ట సేవలకు జిల్లా కలెక్టర్ డా. వి.ఎస్. వెంకటేశ్వర్‌కు ఘన సత్కారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • బీజేపీ–టీడీపీ నాయకుల అభినందనలు..
  • మరిన్ని ఉన్నత బాధ్యతల్లో విజయాలు సాధించాలని ఆకాంక్ష తిరుపతి, జూలై 4 : తిరుపతి జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లపాటు విశిష్ట సేవలందించిన డాక్టర్ వి.ఎస్.
  • వెంకటేశ్వర్‌ను శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

తిరుపతి, జూలై 4 : తిరుపతి జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లపాటు విశిష్ట సేవలందించిన డాక్టర్ వి.ఎస్. వెంకటేశ్వర్‌ను శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వరదయ్యపాలెం మండల బీజేపీ అధ్యక్షుడు దిలీప్ రాయల్, తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం అడ్వకేట్ డా. ఎస్. నాగరాజు, బీజేపీ యువ మోర్చా నాయకులు అన్వేష్,
కలిసి కలెక్టర్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ, తిరుపతి జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనలో డాక్టర్ వి.ఎస్. వెంకటేశ్వర్ అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. జిల్లా కలెక్టర్‌గా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన పరిపాలన అందించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత బాధ్యతల్లోనూ ఇదే నిబద్ధతతో విశిష్ట సేవలందించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా, శ్రీ కలియుగ వేంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని వారు ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *