వార్త ముఖ్యాంశాలు
- దత్తలూరు: దత్తలూరు మండలం తెడ్లుపాడు బీసీ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
- వరికుంటపాడు కోల్డ్ స్టోరేజ్ నుండి పొగాకు చెక్కుల లోడ్‌తో కొండాపురం మండలం పార్లపల్లికి వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి, రోడ్డుపై ఉన్న గేదెను ఢీకొని బోల్తా పడింది.
- ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
దత్తలూరు: దత్తలూరు మండలం తెడ్లుపాడు బీసీ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరికుంటపాడు కోల్డ్ స్టోరేజ్ నుండి పొగాకు చెక్కుల లోడ్‌తో కొండాపురం మండలం పార్లపల్లికి వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి, రోడ్డుపై ఉన్న గేదెను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్‌లోని పొగాకు చెక్కులన్నీ హైవేపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.