Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

వార్త ముఖ్యాంశాలు

  • --35 రోజుల నిరీక్షణకు తెర..
  • నగరంలో వర్షాలు --రానున్న రెండు గంటల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది.
  • దాదాపు 35 రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న నగరవాసులకు వాతావరణం ఊరటనిస్తోంది.

–35 రోజుల నిరీక్షణకు తెర.. నగరంలో వర్షాలు
–రానున్న రెండు గంటల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం
హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. దాదాపు 35 రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న నగరవాసులకు వాతావరణం ఊరటనిస్తోంది. సరూర్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, నాగోల్‌, హయత్‌నగర్‌, బీఎన్‌రెడ్డి నగర్‌ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లు సమాచారం.

రానున్న రెండు గంటల్లో నగరంలోని మరిన్ని ప్రాంతాలకు వర్షం విస్తరించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, రాజేంద్రనగర్‌, శేర్లింగంపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసే సూచనలున్నాయి.
అలాగే చాంద్రాయణగుట్ట, అబిడ్స్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌, హిమాయత్‌నగర్‌, నాచారం ప్రాంతాలతోపాటు మణికొండ, షేక్‌పేట్‌, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ పరిసరాల్లోనూ వర్షం పడే అవకాశముంది. వర్షం సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *