Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

హెల్మెట్.. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
హెల్మెట్.. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

గాజువాక, సెప్టెంబర్ 21 (పున్నమి ప్రతినిధి): గాజువాక మార్కెట్, కనితి రోడ్డు, రత్నవారి వంటిల్లు నుంచి సమతా నగర్ జంక్షన్ వరకు గాజువాక ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గాజువాక ట్రాఫిక్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శాంతారాం ఆధ్వర్యంలో సిబ్బంది వాహనదారులకు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలను నడిపే సమయంలో డ్రైవర్‌తో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్‌ ధరించాలని అవగాహన కల్పించారు. వాహనం నడుపుతున్నప్పుడు సెల్‌ఫోన్‌ వినియోగించకుండా, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. అలాగే రోడ్లపై అనధికారికంగా వాహనాలను పార్కింగ్‌ చేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, నిర్ణీత పార్కింగ్‌ ప్రదేశాల్లోనే వాహనాలను నిలిపివేయాలని తెలిపారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాలను నివారించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

హెల్మెట్.. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

హెల్మెట్.. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *