Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

హజ్రత్ గౌస్‌-ఎ-ఆజం దస్తగిరి స్వామి ఉరుసు సందర్భంగా అన్నదానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

సిద్ధవటం మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో హజ్రత్ గౌస్‌-ఎ-ఆజం దస్తగిరి స్వామి ఉరుసు సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఉరుసు సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈరోజు రాత్రి 7 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. సిద్ధవటం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

హజ్రత్ గౌస్‌-ఎ-ఆజం దస్తగిరి స్వామి ఉరుసు సందర్భంగా అన్నదానం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *