Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

స్వదేశీ వస్తువులనే వాడుదాం: బీజేపీ నేత బీఎస్ మూర్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అయినవిల్లి మండలం బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ అధ్యక్షతన మంగళవారం ముక్తేశ్వరం పార్టీ బీజేపీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
  • ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా బీజేపీ అమలాపురం నియోజకవర్గ పూర్వపు కన్వీనర్ అయినవిల్లి మండల ఇంచార్జి బీఎస్ మూర్తి పాల్గొన్నారు.
  • ముందుగా ఆత్మ నిర్భర భారత్ సంకల్ప అభియాన్ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అయినవిల్లి మండలం బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ అధ్యక్షతన మంగళవారం ముక్తేశ్వరం పార్టీ బీజేపీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా బీజేపీ అమలాపురం నియోజకవర్గ పూర్వపు కన్వీనర్ అయినవిల్లి మండల ఇంచార్జి బీఎస్ మూర్తి పాల్గొన్నారు. ముందుగా ఆత్మ నిర్భర భారత్ సంకల్ప అభియాన్ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రతీ ఇంట స్వదేశీ ఇంటింటా స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్బర్ భారత్ సంకల్ప అభియాన్ లో గ్రామాలు పేదలు అన్నదాతలు మహిళలు మరియు యువత ద్వారానే స్వాలంబన భారత్ సిద్ధిస్తుందని అన్నారు. అనంతరం మండల కమిటీ బూత్ కమిటీ శక్తి కమిటీలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయినవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ మాట్లాడుతూ స్వదేశీ వస్తువులను వాడడం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్రాభివృద్ధికి పునాది వేయడం జరుగుతుందని, విదేశీ వస్తువులను బహిష్కరిద్దాం అని అన్నారు. అనంతరం మండల ఇన్చార్జిగా నియమితులైన బీఎస్ మూర్తి ని శాలువా తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మహిళా మోర్చా స్పెషల్ ఇన్వైట్ యనమదల రాజ్యలక్ష్మి, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొప్పనాతి శ్రీరామచంద్ర మూర్తి, యువమోర్చా నాయకులు భరత్ శ్రీ వర్మ, జిల్లా ఓబీసీ నాయకులు మరియు పీఏసీఎస్ డైరెక్టర్ మిద్దె రవి రాజ్, మండల ప్రధాన కార్యదర్శి మొగలి దుర్గారావు, మండల సీనియర్ నాయకులు ముద్రగడ రామకృష్ణ, ముసిని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *