Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిజామాబాద్

స్పీకర్ గారి పట్ల మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునాం -జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్పీకర్ గారి పట్ల మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునాం -జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి…

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

ఈరోజు నిజామాబాదు రూరల్ నియోజకవర్గం డిచ్ పల్లి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి గారు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా నగేష్ రెడ్డి గారు మాట్లాడుతు అసెంబ్లీ సమావేశం సందర్బంగా brs నాయకులు అసెంబ్లీ స్పీకర్ పట్ల వ్యవహరించిన తీరును జిల్లా కాంగ్రెస్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నం.BRS నాయకులు నల్ల టీ షర్ట్ ధరించి వాటి పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, మహిళ పోలీసుల ముందు టీ షర్ట్స్ విప్పి అసభ్యకరంగా ప్రవర్తించారని, నిన్నటి ఘటన తెలంగాణ కి చీకటి రోజన్నారు.కెసిఆర్ గారు ఏ ఒక్క రోజు కుడా అసెంబ్లీకి రాలేడని,ఆయన మీద దాదాపు 22కోట్ల వరకు ప్రజ ధనం వృధా చేసారని దీనికి brs నాయకులు సమాధానం చెప్పాలన్నారు.కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుంటే విమర్శలు చేస్తున్నారని, ప్రతి పక్ష నాయకులు విమర్శలు మాని ప్రభుత్వానికి సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు, 200యూనిట్ల ఉచిత విద్యుత్,రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు రుణ మాఫీ, జిల్లాకు 4ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంజనిరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు.ఇప్పటికయినా brs నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబొమని brs ఎమ్మెల్సీ తాత మధుపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాలరాజ్, గాదారి గోపి, జిల్లా ST సెల్ అధ్యక్షులు యాదగిరి,జిల్లా ప్రధాన కార్యదర్శి బున్నే రవి, జిల్లా కార్యదర్శి గణేష్, సర్పంచ్ శ్రీను, నర్సయ్య, గంగారెడ్డి, మధు, అశోక్, శ్రీనివాస్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

స్పీకర్ గారి పట్ల మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునాం -జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *