వార్త ముఖ్యాంశాలు
- డాక్టర్ బి.ఆర్.
- అంబేద్కర్ కోనసీమ జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.
- ఆర్.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. సున్నిత, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు, ఎన్నికల సామగ్రి, సిబ్బంది శిక్షణ, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్, రెవెన్యూ, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.