Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్థానిక ఎన్నికల వేళ పోలీసుల నిఘా.. మూడు ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్థానిక ఎన్నికల వేళ పోలీసుల నిఘా.. మూడు ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్

సీతారామపురం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం బసినేనిపల్లి, సింగారెడ్డిపల్లి గ్రామాలతో పాటు సీతారామపురం పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఉదయగిరి సీఐ అంకమ్మరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కవాతులో స్థానిక ఎస్ఐ వెంకట రాజేష్‌తో పాటు ఎస్ఐలు సుభాషిని, మహేంద్ర, మధుసూదన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజలు సంయమనం పాటిస్తూ, పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలను పటిష్ఠం చేసినట్లు తెలిపారు.

స్థానిక ఎన్నికల వేళ పోలీసుల నిఘా.. మూడు ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *