Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

సైన్స్ ప్రతిభలో చిట్వేల్ విద్యార్థుల మెరుపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సైన్స్ ప్రతిభలో చిట్వేల్ విద్యార్థుల మెరుపు

వార్త ముఖ్యాంశాలు

  • అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) విద్యార్థులు కౌశల్ సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు - 2025 జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.
  • ఈ పోటీలను భారతీయ విజ్ఞాన మండలి మరియు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.
  • దుర్గరాజు తెలిపారు.

అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) విద్యార్థులు కౌశల్ సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు – 2025 జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.
ఈ పోటీలను భారతీయ విజ్ఞాన మండలి మరియు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీయడం, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించడమే ఈ పోటీల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. క్విజ్‌, పోస్టర్‌, రీల్స్‌ విభాగాలలో మూడు స్థాయిల్లో పోటీలు జరుగనున్నాయని వివరించారు.

జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు:
కె. తేజశ్రీ, కె. హేమసాయిరెడ్డి, ఎస్. అహమ్మద్‌, పి. భవ్య (రీల్స్‌), జె. సాత్విక (పోస్టర్‌).

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఉపాధ్యాయుల బృందం విద్యార్థులను అభినందించి చిన్న బహుమతులు అందజేశారు.
జిల్లా స్థాయి ఆన్‌లైన్ పరీక్షలు ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్నాయని, విద్యార్థులు మరింత ప్రతిభ కనబరచాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *