Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

సేవా సంకల్ప్ అభియాన్’లో మెరిసిన డాఫోడిల్స్ విద్యార్థులు ​చిత్రలేఖనం, ఉపన్యాస పోటీల్లో సృజనాత్మక ప్రతిభ ప్రదర్శన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సేవా సంకల్ప్ అభియాన్’లో మెరిసిన డాఫోడిల్స్ విద్యార్థులు ​చిత్రలేఖనం, ఉపన్యాస పోటీల్లో సృజనాత్మక ప్రతిభ ప్రదర్శన

వార్త ముఖ్యాంశాలు

  • విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, సామాజిక బాధ్యత, సృజనాత్మక ఆలోచనలు పెంపొందించాల్సిన అవసరం ఉందని సేవా సంకల్ప్ అభియాన్ వరంగల్ జిల్లా కన్వీనర్ డా.
  • గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.
  • ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా నర్సంపేట పట్టణంలోని డాఫోడిల్స్ సీబీఎస్‌ఈ స్కూల్ (Daffodils CBSE School) విద్యార్థులకు “నరేంద్ర మోదీ – నేటి భారతం” అనే అంశంపై చిత్రలేఖనం మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించారు.

విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, సామాజిక బాధ్యత, సృజనాత్మక ఆలోచనలు పెంపొందించాల్సిన అవసరం ఉందని సేవా సంకల్ప్ అభియాన్ వరంగల్ జిల్లా కన్వీనర్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా నర్సంపేట పట్టణంలోని డాఫోడిల్స్ సీబీఎస్‌ఈ స్కూల్ (Daffodils CBSE School) విద్యార్థులకు “నరేంద్ర మోదీ – నేటి భారతం” అనే అంశంపై చిత్రలేఖనం మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించారు.
​బీజేపీ నర్సంపేట నియోజకవర్గ నాయకులు జూలూరు మనీష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డా. రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
​అలరించిన వర్ణచిత్రాలు, ప్రసంగాలు:
చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అంతరిక్ష రంగంలో విజయాలు, యువతకు లభిస్తున్న అవకాశాలను తమ చిత్రాల ద్వారా ఆవిష్కరించారు. ఉపన్యాస పోటీల్లో ప్రసంగ ప్రతిభతో ఆకట్టుకున్నారు.
​పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ మాట్లాడుతూ, విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో తోడ్పడతాయన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని, ఆయన జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *