Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

సెప్టెంబర్ 7 నుంచి పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సెప్టెంబర్ 7 నుంచి పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ

పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 06)
వేముల: రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విధి విధానాలను ఖరారు చేయడంతో అర్హులైన వారి నుంచి పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు అర్హులైన వారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులు తమకు సమీపంలోని గ్రామ సచివాలయాన్ని సంప్రదించి, అక్కడి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు నమోదు అనంతరం రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

ఉయ్యూరు మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసుకునేలా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సెప్టెంబర్ 7 నుంచి పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *