Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం – భారత్‌లో నాలుగు నగరాల్లో క్లియర్ వ్యూ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం – భారత్‌లో నాలుగు నగరాల్లో క్లియర్ వ్యూ

వార్త ముఖ్యాంశాలు

  • 2025 సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.
  • సుమారు 82 నిమిషాలు కొనసాగే ఈ గ్రహణాన్ని ప్రపంచంలోని 85 శాతం ప్రజలు వీక్షించగలరని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
  • ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్‌లో ఇది స్పష్టంగా కనిపించనుంది.

2025 సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సుమారు 82 నిమిషాలు కొనసాగే ఈ గ్రహణాన్ని ప్రపంచంలోని 85 శాతం ప్రజలు వీక్షించగలరని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్‌లో ఇది స్పష్టంగా కనిపించనుంది. భారతదేశంలో మాత్రం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో క్లియర్ వ్యూ లభిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అహ్మదాబాద్, పూణే, లక్నో వంటి నగరాలు కూడా అద్భుతమైన వ్యూ పాయింట్లని పేర్కొన్నారు. ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 8:58 గంటలకు ప్రారంభమై, రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 వరకు సంపూర్ణంగా కనిపించి, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుంది. ఈ దశాబ్దంలోనే అత్యంత స్పష్టమైన చంద్రగ్రహణాల్లో ఇదొకటని నిపుణులు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *