Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

*సూళ్లూరుపేటలో గుర్తుతెలియని వ్యక్తి హత్య కలకలం!*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*సూళ్లూరుపేటలో గుర్తుతెలియని వ్యక్తి హత్య కలకలం!*

వార్త ముఖ్యాంశాలు

  • *BREAKING NEWS* సూళ్లూరుపేట చెంగాళమ్మ లేఅవుట్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.
  • మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
  • పోలీసుల అనుమానం: దుండగులు అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని అక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

*BREAKING NEWS*
సూళ్లూరుపేట చెంగాళమ్మ లేఅవుట్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసుల అనుమానం: దుండగులు అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని అక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబు ఘటనాస్థలాన్ని స్వయంగా సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యేక బృందాలు: సీఐ మురళీకృష్ణ పర్యవేక్షణలో, ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. విజ్ఞప్తి: మృతుని ఆచూకీ లేదా వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సంప్రదించవలసిన నెంబర్లు:
సీఐ సూళ్లూరుపేట: 9440796360
ఎస్సై సూళ్లూరుపేట: 9440796361

Leave a comment

Your email address will not be published. Required fields are marked *