Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేటలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులకు శ్రీకారం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సూళ్లూరుపేటలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులకు శ్రీకారం*

వార్త ముఖ్యాంశాలు

  • *సూళ్లూరుపేట:* సూళ్లూరుపేట పట్టణంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.
  • పట్టణంలో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న *కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీ కెమెరాల పనులకు* గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
  • సూళ్లూరుపేట ఎమ్మెల్యే *డా.

*సూళ్లూరుపేట:* సూళ్లూరుపేట పట్టణంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.

పట్టణంలో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న *కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీ కెమెరాల పనులకు* గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సూళ్లూరుపేట ఎమ్మెల్యే *డా. నెలవల విజయశ్రీ* ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ… పట్టణంలోని *50 ప్రాంతాల్లో 110 అత్యాధునిక సీసీ కెమెరాలను* ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల నేరాలను అరికట్టడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణ కూడా సులభం అవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *