వార్త ముఖ్యాంశాలు
- తిరుపతి: సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజుపై దురుసుగా ప్రవర్తించి, ఆయన బండి బిగాలు లాక్కుని వెళ్లకుండా అడ్డుకున్న ఎస్ఐ ప్రసాద్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీ రైల్వే కోడూర్ నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్, సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేసాయి.
- మంగళవారం ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ,ఒక జాతీయ రాజకీయ పార్టీ జిల్లా కార్యదర్శి పట్ల పోలీసు అధికారి ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమని, ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ…
- ఆదివారం నిరసన ముగించుకుని నాయకులు తిరిగి బయలుదేరుతున్న సమయంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు బండి వద్దకు వచ్చిన ఎస్ఐ ప్రసాద్, ఈ వారం జరిగిన ఘటనపై నోటీసు తీసుకోమని బలవంత పెట్టడం ఆయన బండి బిగాలు లాక్కుని ఆపి, వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు.
తిరుపతి: సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజుపై దురుసుగా ప్రవర్తించి, ఆయన బండి బిగాలు లాక్కుని వెళ్లకుండా అడ్డుకున్న ఎస్ఐ ప్రసాద్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీ రైల్వే కోడూర్ నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్, సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేసాయి. మంగళవారం ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ,ఒక జాతీయ రాజకీయ పార్టీ జిల్లా కార్యదర్శి పట్ల పోలీసు అధికారి ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమని, ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించిన వామపక్ష పార్టీలు, ఆదివారం కూడా నిరసన కొనసాగించాయి. ఆదివారం నిరసన ముగించుకుని నాయకులు తిరిగి బయలుదేరుతున్న సమయంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు బండి వద్దకు వచ్చిన ఎస్ఐ ప్రసాద్, ఈ వారం జరిగిన ఘటనపై నోటీసు తీసుకోమని బలవంత పెట్టడం ఆయన బండి బిగాలు లాక్కుని ఆపి, వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. శనివారం దిష్టిబొమ్మ దహనం చేసినందుకు కేసు నమోదు చేశామని, నోటీసులు తీసుకోవాలని ఎస్ఐ దురుసుగా మాట్లాడినట్లు పేర్కొన్నారు.నోటీసులు తీసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కార్యాలయానికి వచ్చి తీసుకుంటామని నాగరాజు చెప్పినా ఎస్ఐ వినిపించుకోలేదని తెలిపారు. “నేను ఎస్ఐని.. నా మాట వినవా? ఇప్పుడే నోటీసులు తీసుకోవాలి” లేకపోతే కదలనిచ్చేది లేదు అంటూ అధికార దర్పంతో మాట్లాడారని, చుట్టూ ఉన్న వామపక్ష నాయకులు, కార్యకర్తలు ఎంతగా నచ్చజెప్పినా పట్టించుకోకుండా వ్యవహరించారని విమర్శించారు. నోటీసులు ఇవ్వాలనుకుంటే చట్ట ప్రకారం వ్యవహరించాలి తప్ప, బండి బిగాలు లాక్కుని బెదిరిస్తూ వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక జాతీయ రాజకీయ పార్టీ జిల్లా కార్యదర్శి అని తెలిసినా కనీస గౌరవం ఇవ్వకుండా, ఆయన చెప్పేది వినకుండా దురుసుగా ప్రవర్తించడం సరికాదని తెలిపారు. పోలీసులకు చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉందే తప్ప, అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాయకులను అవమానించే హక్కు లేదని పేర్కొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు బండి బిగాలు లాక్కుని, దురుసుగా ప్రవర్తించి, వెళ్లకుండా అడ్డుకున్న ఎస్ఐ ప్రసాద్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి. పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యుడైన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పి జాన్ ప్రసాద్, కే హరినారాయణ పాల్గొన్నారు.