వార్త ముఖ్యాంశాలు
- సీతారామపురం–ఉదయగిరి NH-167BGపై బసినేనిపల్లి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు.
- టోల్ ప్లాజా వద్ద హైవేకు ఇరువైపులా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు.
- వివిధ రకాల వాహనాలకు వసూలు చేయాల్సిన టోల్ రుసుముల కోసం ప్రత్యేక కాలమ్స్ ఉన్నప్పటికీ, వాటిలో ధరలను నమోదు చేయలేదు.
సీతారామపురం–ఉదయగిరి NH-167BGపై బసినేనిపల్లి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. టోల్ ప్లాజా వద్ద హైవేకు ఇరువైపులా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. వివిధ రకాల వాహనాలకు వసూలు చేయాల్సిన టోల్ రుసుముల కోసం ప్రత్యేక కాలమ్స్ ఉన్నప్పటికీ, వాటిలో ధరలను నమోదు చేయలేదు. దీంతో తమ వాహనానికి ఎంత టోల్ చెల్లించాలో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బోర్డుల్లో టోల్ రేట్లను స్పష్టంగా పొందుపరచాలని వాహనదారులు కోరుతున్నారు.