Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

సీఎం సార్ మాగోడు వినండి..! — బుడగ జంగాల మహిళ ఆవేదన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీఎం సార్ మాగోడు వినండి..! — బుడగ జంగాల మహిళ ఆవేదన

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

సీఎం సార్ మాగోడు వినండి..! — బుడగ జంగాల మహిళ ఆవేదన

ప్రభుత్వం కేటాయించిన 90 గజాల స్థలంలో గుడిసె వేసుకుని జీవనం..

అధికారులు అకారణంగా ఖాళీ చేయిస్తున్నారని దంపతుల ఆరోపణ

ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన

రూ.50 వేల లంచం డిమాండ్ చేశారని అధికారిపై ఆరోపణ

మంత్రి ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపణ

ఆమనగల్లు: ప్రభుత్వం కేటాయించిన 90 గజాల స్థలంలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్న తమను అకారణంగా అక్కడి నుంచి వెళ్లగొడుతున్నారని బుడగ జంగాల వర్గానికి చెందిన బేబీ, లక్ష్మయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన స్థలంలోనే నివాసం ఉంటున్నప్పటికీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు.

తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని దంపతులు వాపోయారు. తమకు న్యాయం చేయాల్సిన అధికారులు సమస్యను పరిష్కరించకుండా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ఆమనగల్లులో ఓ అధికారి తమ సమస్యను పరిష్కరించేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేశారని బేబీ ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.

తమ సమస్యపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలంలో ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించాలని కోరారు.

సీఎం స్పందించి న్యాయం చేయాలి

నిరుపేదలమైన తమపై అధికారులు వేధింపులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని, తమకు కేటాయించిన 90 గజాల స్థలంపై రక్షణ కల్పించాలని బేబీ, లక్ష్మయ్య దంపతులు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి తమ గోడును విని, సంబంధిత అధికారులపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని పున్నమి న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Uploaded Video:

సీఎం సార్ మాగోడు వినండి..! — బుడగ జంగాల మహిళ ఆవేదన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *