Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

సిపిఎం ప్రజా సంఘాలు నాయకులు అరెస్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సిపిఎం ప్రజా సంఘాలు నాయకులు అరెస్ట్

*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*

*సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు అరెస్ట్*

ఓటు చోరీకి పాల్పడిన వారిని కాపాడుతూ, ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయించడం సిగ్గుచేటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు విమర్శించారు. వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఆందోళన చేస్తున్న సీపీఎం, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఓటు చోరీ అంశంపై రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఓటు చోరీకి పాల్పడిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థించడం దుర్మార్గమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు ఆరోపించారు.విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన సీహెచ్ బాబురావుతో పాటు సుమారు 30 మంది సీపీఎం, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడిన బాబురావు.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం తన బాధ్యతలను విస్మరిస్తోందని విమర్శించారు. 13 కోట్ల ఓట్ల చోరీకి సంబంధించిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రభావానికి ఎన్నికల కమిషనర్ లోనయ్యారని బాబురావు ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని సీపీఎం పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణకు మద్దతు తెలపాలని బాబురావు విజ్ఞప్తి చేశారు.

సిపిఎం ప్రజా సంఘాలు నాయకులు అరెస్ట్

సిపిఎం ప్రజా సంఘాలు నాయకులు అరెస్ట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *