వార్త ముఖ్యాంశాలు
- శ్రీ కాళహస్తి, ఆగస్టు 30, (పున్నమి న్యూస్): చెన్నై చిత్రాస్ హాస్పిటల్ అధినేత, ఆల్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్ ప్రముఖ ఈఎన్టీ (ముక్కు, చెవి, గొంతు) వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ కృష్ణయ్య ఆదివారం నాడు శ్రీకాళహస్తి చెన్నై రోడ్డులో వెలసి ఉన్న షిరిడి సాయిబాబా ఆలయాన్ని…
- క్షేత్రానికి విచ్చేసిన ఆయనకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు సాదరంగా స్వాగతం పలికారు.
- అనంతరం ఆలయంలో ప్రవేశించిన డాక్టర్ కృష్ణయ్యకు అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను గరికపాటి రమేష్ బాబు దగ్గరుండి జరిపించారు.
శ్రీ కాళహస్తి, ఆగస్టు 30, (పున్నమి న్యూస్): చెన్నై చిత్రాస్ హాస్పిటల్ అధినేత, ఆల్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్ ప్రముఖ ఈఎన్టీ (ముక్కు, చెవి, గొంతు) వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ కృష్ణయ్య ఆదివారం నాడు శ్రీకాళహస్తి చెన్నై రోడ్డులో వెలసి ఉన్న షిరిడి సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్రానికి విచ్చేసిన ఆయనకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రవేశించిన డాక్టర్ కృష్ణయ్యకు అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను గరికపాటి రమేష్ బాబు దగ్గరుండి జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ డాక్టర్ కృష్ణయ్యకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి స్వామివారి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు. పూజా అనంతరం డాక్టర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఈ షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణం ఎంతో అద్భుతంగా, ప్రశాంతతతో విరజిల్లుతోందని కొనియాడారు. ఇక్కడికి వచ్చే భక్తులు అపార నమ్మకంతో మొక్కుకుంటే వారి కోరికలు తప్పక నెరవేరుతున్నాయని, బాబా దివ్య అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ సేవా సమితి ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.