Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

సామాజిక భద్రత పథకాలు సద్వినియోగం చేసుకోవాలి – కౌన్సిలర్ భూమన్న

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సామాజిక భద్రత పథకాలు సద్వినియోగం చేసుకోవాలి – కౌన్సిలర్ భూమన్న

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలో గ్రామ సర్పంచ్ కిషన్ అధ్యక్షతన ప్రజలందరికీ బ్యాంకు సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక సమ్మిళిత సంతృప్తి ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు సిఎఫ్ఎల్ కౌన్సిలర్ భూమన్న తెలిపారు.
  • ఈ సందర్భంగా టిజిబి అంకోలి బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, కౌన్సిలర్ భూమన్న మాట్లాడుతూ ఈ శిబిరాల్లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలలో అర్హులైన లబ్ధిదారుల నమోదు, ఆధార్ అనుసంధానం, కిసాన్…

ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలో గ్రామ సర్పంచ్ కిషన్ అధ్యక్షతన ప్రజలందరికీ బ్యాంకు సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక సమ్మిళిత సంతృప్తి ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు సిఎఫ్ఎల్ కౌన్సిలర్ భూమన్న తెలిపారు. ఈ సందర్భంగా టిజిబి అంకోలి బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, కౌన్సిలర్ భూమన్న మాట్లాడుతూ ఈ శిబిరాల్లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలలో అర్హులైన లబ్ధిదారుల నమోదు, ఆధార్ అనుసంధానం, కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తులకు సహకారం, ఫసల్ బీమా యోజన కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, కేవైసి వంటి సేవలపై దృష్టి సారించింనట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, టీజీబీ బ్యాంక్ సిబ్బంది రవికిరణ్, బిపిఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *