Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తాం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తాం

వార్త ముఖ్యాంశాలు

  • సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి సభ్యులందరం కృషి చేస్తామని సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి అన్నారు.
  • బుధవారం మండలంలోని అమీనాబాద్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ 72వ వార్షిక సర్వసభ్య సమావేము సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
  • ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మొగలి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సంఘంలో స్వల్పకాలిక రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించిన రైతులకు 3 శాతం వడ్డీ తిరిగి వస్తుందన్నారు.

సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి సభ్యులందరం కృషి చేస్తామని సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అమీనాబాద్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ 72వ వార్షిక సర్వసభ్య సమావేము సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మొగలి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సంఘంలో స్వల్పకాలిక రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించిన రైతులకు 3 శాతం వడ్డీ తిరిగి వస్తుందన్నారు. రైతులందరూ సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అమీనాబాద్ లో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి చొరవతో యూనియన్ బ్యాంక్ వచ్చిందని అన్నారు. యూనియన్ బ్యాంక్ కి సంఘ లో ఉన్న రూములు లీజుకు ఇవ్వడం

జరుగుతుందని తెలిపారు. పాలకవర్గం సంఘ అభివృద్ధికి కృషి చేస్తామనన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సిద్దన రమేష్, సర్పంచ్ దార రంజిత్, ఉప సర్పంచ్ బండి హరీష్, సహకార అధికారి నెక్కొండ సర్కిల్ సీనియర్ ఇన్స్పెక్టర్ దార విమల, డైరెక్టర్లు ఊరుగొండ లింగస్వామి, మంద యాకయ్య గౌడ్ బొంపల్లి ప్రసాద్, మంద సోమయ్య, అంబాల రవి, రాదారపు బిక్షపతి, పెంతల రమ, జోరు వీరయ్య, భూక్య నీల, పానుగంటి వీరమ్మ, దరావత్ భద్రు, రైతులు, సంఘ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *