Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్వేపల్లిలో 85 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సర్వేపల్లిలో 85 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 11 (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఇప్పటివరకు 85 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని ఈఆర్‌ఓ జి.
  • కేశవర్ధన్ రెడ్డి తెలిపారు.
  • శనివారం మనుబోలు ఎంపీడీవో కార్యాలయంలో బీఎల్‌వోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 11 (పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఇప్పటివరకు 85 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని ఈఆర్‌ఓ జి. కేశవర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం మనుబోలు ఎంపీడీవో కార్యాలయంలో బీఎల్‌వోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వేను ముమ్మరంగా చేపడుతున్నారని చెప్పారు. మనుబోలు మండలంలో 83 శాతం డిజిటలైజేషన్ పూర్తైందన్నారు. శని, ఆదివారాలను ప్రత్యేక క్యాంపెయిన్ దినాలుగా నిర్వహిస్తూ డబుల్ ఎంట్రీలు, మృతులు, గ్రామంలో నివసించని వారి పేర్లను తొలగించే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఈఆర్‌వోలు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో జలజాక్షి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *