Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

సరికొత్త ఆలోచనలతోనే వ్యాపార అభివృద్ధి. సిరి మహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో బిజినెస్ మీటింగ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సరికొత్త ఆలోచనలతోనే వ్యాపార అభివృద్ధి. సిరి మహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో బిజినెస్ మీటింగ్

నాగోల్: బండ్లగూడ మార్గంలోని పీబీఆర్ కన్వెన్షన్‌లో సిరి మహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో బిజినెస్ మీటింగ్ నిర్వహించారు. సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ కళ్ళం వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, వ్యాపార భాగస్వాములు, సభ్యులు పాల్గొన్నారు.
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్స్ కోచ్ వేణుగోపాల్ లక్ష్మీపురం గెస్ట్ స్పీకర్‌గా హాజరై వ్యాపార అభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, సేల్స్ వ్యూహాలు, సేల్స్ సైకాలజీ, కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సంస్థ భవిష్యత్ కార్యాచరణ, వ్యాపార విస్తరణ, రిక్రూట్‌మెంట్‌పై చర్చించారు.
సంస్థ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన అచీవర్స్‌ను ఘనంగా సన్మానించారు. పలువురికి టాటా ఏఐజీ ద్వారా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించి సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా కళ్ళం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సంస్థ అభివృద్ధితో పాటు ప్రతి సభ్యుడి వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు అవసరమైన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికీ సంస్థ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

సరికొత్త ఆలోచనలతోనే వ్యాపార అభివృద్ధి. సిరి మహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో బిజినెస్ మీటింగ్

సరికొత్త ఆలోచనలతోనే వ్యాపార అభివృద్ధి. సిరి మహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో బిజినెస్ మీటింగ్

సరికొత్త ఆలోచనలతోనే వ్యాపార అభివృద్ధి. సిరి మహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో బిజినెస్ మీటింగ్

సరికొత్త ఆలోచనలతోనే వ్యాపార అభివృద్ధి. సిరి మహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో బిజినెస్ మీటింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *