Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

సముద్రాల బస్ స్టాండ్ వద్ద ప్రమాదకరంగా మారిన రహదారి – స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు స్థానికుల విజ్ఞప్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సముద్రాల బస్ స్టాండ్ వద్ద ప్రమాదకరంగా మారిన రహదారి – స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు స్థానికుల విజ్ఞప్తి
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 90; hdrForward: 4; shaking: 0.001719; highlight: 1; motionR: 0; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0004,0.0000; brp_del_sen: 0.1300,0.0000; ispap:1; papproctime: 2026:07:09 15:32:39; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 37;

వార్త ముఖ్యాంశాలు

  • జనగామ జిల్లా, ఘన్పూర్ స్టేషన్ పరిధిలోని సముద్రాల గ్రామ బస్ స్టాండ్ ప్రాంతం ప్రస్తుతం ప్రయాణికులకు మరియు స్థానికులకు నిత్యం ప్రమాదకరంగా మారుతోంది.
  • ఈ మార్గం గుండా వెళ్లే వాహనాలు అతివేగంగా దూసుకుపోతుండటంతో, రోడ్డు దాటే వారు, బస్సు కోసం వేచి చూసే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  • ​ప్రధాన రహదారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది, అయితే బస్ స్టాండ్ ఉన్న ప్రాంతంలో కనీసం ఒక స్పీడ్ బ్రేకర్ కూడా లేకపోవడం వల్ల వాహనదారులు వేగాన్ని నియంత్రించడం లేదు.

జనగామ జిల్లా, ఘన్పూర్ స్టేషన్ పరిధిలోని సముద్రాల గ్రామ బస్ స్టాండ్ ప్రాంతం ప్రస్తుతం ప్రయాణికులకు మరియు స్థానికులకు నిత్యం ప్రమాదకరంగా మారుతోంది. ఈ మార్గం గుండా వెళ్లే వాహనాలు అతివేగంగా దూసుకుపోతుండటంతో, రోడ్డు దాటే వారు, బస్సు కోసం వేచి చూసే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
​ప్రధాన రహదారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది, అయితే బస్ స్టాండ్ ఉన్న ప్రాంతంలో కనీసం ఒక స్పీడ్ బ్రేకర్ కూడా లేకపోవడం వల్ల వాహనదారులు వేగాన్ని నియంత్రించడం లేదు. దీనివల్ల ఏ క్షణంలోనైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రోడ్డు దాటడానికి భయపడుతున్నారు.
సంబంధిత అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి, సముద్రాల బస్ స్టాండ్ వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన ‘స్పీడ్ బ్రేకర్లను’ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *