వార్త ముఖ్యాంశాలు
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో నూతనంగా గుర్తించబడిన హెచ్ఐవి సోకిన వ్యక్తులకు,హెచ్ఐవి సోకిన బాలలకు మరియు మందులు మానేసిన వారికి కలసికట్టుగా ఉండడం వలన కలిగే మేలును గూర్చి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిట్టా ధర్మయ్య మాట్లాడుతూ సమిష్టి కృషి ప్రాముఖ్యతను అందరూ గుర్తించాలన్నారు.
- కలిసికట్టుగా ఉండటం ద్వారా అనేక సమస్యలను సులభరీతిలో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో నూతనంగా గుర్తించబడిన హెచ్ఐవి సోకిన వ్యక్తులకు,హెచ్ఐవి సోకిన బాలలకు మరియు మందులు మానేసిన వారికి కలసికట్టుగా ఉండడం వలన కలిగే మేలును గూర్చి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిట్టా ధర్మయ్య మాట్లాడుతూ సమిష్టి కృషి ప్రాముఖ్యతను అందరూ గుర్తించాలన్నారు. కలిసికట్టుగా ఉండటం ద్వారా అనేక సమస్యలను సులభరీతిలో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాభాయి మహిళా మండలి కమ్యూనిటీ ఆర్గనైజర్ ఎం నూకలక్ష్మీ మాట్లాడుతూ క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావడం,సమావేశ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం,సమస్యలను సమావేశంలో చర్చించి, త్వరితగతిన పరిష్కార మార్గాలను కనుగొనడం చేయాల్సి ఉందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రాజెక్ట్ పరిధిలోని స్త్రీ,పురుషులు మరియు బీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.