Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర

వార్త ముఖ్యాంశాలు

  • సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.
  • గురువారం భైంసాలోని ఎస్‌.ఎస్‌.
  • జిన్నింగ్ ఇండస్ట్రీలో అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంబీబీఎస్‌ సీట్లు సాధించిన 30 మంది, ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందిన ఆరుగురు విద్యార్థులతో పాటు 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. గురువారం భైంసాలోని ఎస్‌.ఎస్‌. జిన్నింగ్ ఇండస్ట్రీలో అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంబీబీఎస్‌ సీట్లు సాధించిన 30 మంది, ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందిన ఆరుగురు విద్యార్థులతో పాటు 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ముధోల్‌లో సుమారు రూ.300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల, కుంటాల మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధికి రూ.9 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి భోజన్న, మండల విద్యాధికారులు, మున్సిపల్ చైర్మన్ తుమ్మోళ్ల దత్తాత్రి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *