వార్త ముఖ్యాంశాలు
- రామచంద్రాపురం, సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి సమాజంలో గురువు స్థానం ఎంతో ఉత్తమమైనదని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల కార్పొరేషన్ డైరెక్టర్ అన్నారు.
- రామచంద్రాపురం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
- ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ అధికారులు మార్కండేయనాయుడు,జయ వేలు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
రామచంద్రాపురం, సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి
సమాజంలో గురువు స్థానం ఎంతో ఉత్తమమైనదని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల కార్పొరేషన్ డైరెక్టర్ అన్నారు. రామచంద్రాపురం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయినీ
ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ అధికారులు మార్కండేయనాయుడు,జయ వేలు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చినబాబు
మాట్లాడుతూ రాతిని తెచ్చి శిల్పాన్ని చెక్కి చక్కని రూపం ఇచ్చిన విధంగా ఏమి తెలియని విద్యార్థులకు విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని అందించి సమాజంలో ఒక స్థానం కల్పించే వాడు గురువు అన్నారు. గురువులు అన్ని కాలాలలో అన్నిచోట్ల
పూజింపబడతారన్నారు. ప్రాచీన కాలంలో ఆశ్రమాలే గురు స్థానాలుగా ఉండేవని తండ్రి కుమారుడికి విద్య నేర్పిన గురువుగాని గౌరవస్థానం ఇచ్చేవారన్నారు. మండల టిడిపి అధ్యక్షులు తిరుమలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పారవేసికంగా పారదర్శకంగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియను చేపట్టి ఉపాధ్యాయుల నియామకం చేపట్టిందని చెప్పారు. ఉత్తమ ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు మన విద్యా వ్యవస్థకు వన్నె తేగలరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు.
విద్యార్థులను తమ సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ చక్కటి బోధన సాగించాలి అని కోరారు. మండల విద్యాశాఖ అధికారి మార్కండేయనాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిస్వార్థంతో తమ విద్యార్థులకు విద్యాబోధన గావించే
వారిని వివరించారు. గురువు అన్ని వేళల కూడా తమ విద్యార్థులను ఉన్నత స్థితిలో చూడాలని భావిస్తారని
చెప్పారు. మనదేశంలో పురాతన కాలం నుంచి బృహస్పతి, శుక్రాచార్యుడు, ద్రోణుడు, సాందీపుడు,వ ంటి ఉత్తమ గురువులు చరస్మరణీయులుగా మిగిలారన్నారు. ఆధునిక కాలంలో జ్యోతిరావు పూలే, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి వారు ‘ అందించారన్నారు. మండల విద్యాశాఖ అధికారి ఎంతో ఉత్తమ గురువుగా సేవలు
జయవేలు మాట్లాడుతూ అజ్ఞాన చీకట్లను పారదోలి విజ్ఞాన కాంతులను నింపటానికి గురువు ఒక ఉత్తమ సాధకుడుగా పనిచేస్తాడని తెలిపారు. నేటి ఆధునిక యుగంలో విద్యాబోధన ఎంతో సరళతరంగా కొనసాగించడానికి గురువులకు పలివిదాల శిక్షణలు
ఇస్తున్నారని తెలియజేశారు. ఉత్తమ సేవలు అందించిన గురువును ప్రభుత్వం గుర్తించి తగిన
విధంగా ఉత్తమ ప్రశంసలతో ప్రోత్సహిస్తున్నదన్నారు. గురువులందరి సహకారంతో మన మండలంలో విద్యావ్యవస్థను ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.