వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు, అక్టోబర్ 28 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి బుధవారం ఉదయం పరిశీలించారు.
- పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 7/1, 8/1, 9/1, 9/2, 10/1 నంబర్లు గల హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు.
- ఆయా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణకు సంబంధించిన అంశాలను పరిశీలించి, చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఆత్మకూరు, అక్టోబర్ 28 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి బుధవారం ఉదయం పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 7/1, 8/1, 9/1, 9/2, 10/1 నంబర్లు గల హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణకు సంబంధించిన అంశాలను పరిశీలించి, చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.ఈ పరిశీలనలో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.