Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి, మట్టా దయానంద్ విజయ్ కుమార్ ల పర్యటన…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి, మట్టా దయానంద్ విజయ్ కుమార్ ల పర్యటన…

సత్తుపల్లి/ఖమ్మం

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్తో కలిసి గురువారం సత్తుపల్లి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలతో పాటు పరామర్శల్లో పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ తోట సుజలారాణి-గణేష్ నివాసంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. CSI చర్చ్ రోడ్డులో సత్తుపల్లి నియోజకవర్గ NSUI అధ్యక్షుడు అర్వపల్లి సందీప్ గౌడ్ మాతృమూర్తి ఇటీవల మృతిచెందడంతో వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాకర్లపల్లి రోడ్డులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చల్లగుళ్ల నరసింహారావును కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, AMC చైర్మన్ దోమ ఆనంద్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గాదె చెన్నారావు, కౌన్సిలర్ తోట సుజలారాణి గణేష్, NSUI అధ్యక్షుడు సందీప్ గౌడ్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి, మట్టా దయానంద్ విజయ్ కుమార్ ల పర్యటన…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *