వ్యావహారిక భాషను ప్రజలకు చేరువ చేయడా నికి గిడుగు రామమూర్తి చేసిన కృషికి గుర్తిం పుగా తెలుగు భాషా దినోత్సవం,సమాజంలో సామాజిక మార్పులు తీసుకురావడానికి, క్రీడల ద్వారా ప్రపంచ దేశాల మధ్య శాంతి, ఐక్యతను పెంపొందించడానికి అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ప్రతి ఏటా నిర్వహిస్తున్నారని
ప్రధానోపాధ్యురాలు కె.భారతి అన్నారు.
రాజంపేట మండలం కొత్త బోయినపల్లి పీఎం శ్రీ ఎస్.జె.ఎస్ఎం.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవం,అంతర్జాతీయ క్రీడా దినో త్సవాలను సంయుక్తంగా వేడుకగా నిర్వహించారు.ప్రధానోపాధ్యురాలు కె.భారతి, తెలుగు భాషా ఉపాధ్యాయులు యం.చెన్న కేశవులు,సువర్ణ సుందరి,పిడి. డాక్టర్ ప్రణవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలుగు వాడుక భాషోద్యమ ఆద్యుడు గిడుగు వెంకట రామమూర్తి,హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా క్రీడల్లో,వ్యాసరచనలో, చిత్ర లేఖనలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం గావించారు.చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఇంకా ఈ సమావేశంలో యం.ఓబులేసు,పి.శ్రీ రాములు,శివ ప్రసాద్ గౌడ్,ఎస్.ప్రభాకర్రావు ,అనిల్,మేరీ,అమరావతి, మధువాణి,ప్రణవి, డి.శ్రీనివాసులు ఆచారి, యం.సాయినాథ్, ప్రశాంత్,సి.ఆర్.పి. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
