Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకుయూనిఫామ్, ఆట సామాగ్రి పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

నెల్లూరు జిల్లా కుల్లూరు మెయిన్ స్కూల్‌లో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్, ఆట సామాగ్రిని పంపిణీ చేశారు. కుల్లూరు మెయిన్ స్కూల్‌లోని 47 మంది విద్యార్థులకు, హరిజనవాడ స్కూల్‌లోని 62 మంది విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేయడంతో పాటు రెండు పాఠశాలల్లో విద్యార్థులు ఆడుకునేందుకు అవసరమైన ఆట సామాగ్రిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డోనర్ సురేందర్ రెడ్డి, శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుధాకర్‌తో పాటు సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సమాజంలో మంచి పౌరులుగా ఎలా మెలగాలి, తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను ఆదరించడం, దైవభక్తితో ముందుకు సాగడం వంటి విషయాలను వివరించారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే విలువలను జీవితంలో పాటిస్తూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *