Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • *​శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.
  • రాంసుందర్ రెడ్డి* *ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పణ* ​విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 27.
  • పున్నమి ప్రతినిధి విజయనగరం ప్రజల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారిని జిల్లా కలెక్టర్ ఎస్.

*​శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి*

*ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పణ*

​విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 27. పున్నమి ప్రతినిధి

విజయనగరం ప్రజల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారిని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు.
​ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి కలెక్టర్ దంపతులు అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అధికారులు, అర్చకులు కలెక్టర్ దంపతులకు ఘన స్వాగతం పలికి, అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
​అనంతరం అర్చకులు కలెక్టర్ దంపతులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందించి, వేదాశీర్వచనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శిరీష, ఆర్డీవో సుధా సాగర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *