Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీసిటీలో నూతన లింక్ రోడ్డు ప్రారంభం – గ్రామస్థులకు, పారిశ్రామిక వర్గాలకు ఎంతో మేలు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీసిటీలో నూతన లింక్ రోడ్డు ప్రారంభం – గ్రామస్థులకు, పారిశ్రామిక వర్గాలకు ఎంతో మేలు*

వార్త ముఖ్యాంశాలు

  • *శ్రీసిటీ, సెప్టెంబర్ 24 :* తిరుపతి జిల్లా శ్రీసిటీ సెజ్ పరిధిలో మరో కీలక అభివృద్ధి అడుగు పడింది.
  • *మల్లవారిపాలెం - ఆరూరు మధ్య 4 కిలోమీటర్ల నూతన లింక్ రోడ్డును* గురువారం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
  • శ్రీసిటీ *డీఎస్పీ బి.వి.

*శ్రీసిటీ, సెప్టెంబర్ 24 :* తిరుపతి జిల్లా శ్రీసిటీ సెజ్ పరిధిలో మరో కీలక అభివృద్ధి అడుగు పడింది.

*మల్లవారిపాలెం – ఆరూరు మధ్య 4 కిలోమీటర్ల నూతన లింక్ రోడ్డును* గురువారం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీసిటీ *డీఎస్పీ బి.వి. శ్రీనివాసులు* గారు రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ఈ నూతన రహదారిని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీసిటీ *ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి* గారు మాట్లాడుతూ… కొత్తగా నిర్మించిన ఈ లింక్ రోడ్డుతో వాహనాల రాకపోకలు సాఫీగా, సురక్షితంగా సాగడంతో పాటు, చుట్టుపక్కల గ్రామస్థులకు, పారిశ్రామిక వర్గాలకు ఎంతో ప్రయోజనం కలగనుందని తెలిపారు.

రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు, పారిశ్రామిక అభివృద్ధికి ఈ రోడ్డు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీసిటీ అధికారులు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *