Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

శ్రీశ్రీ – అభ్యుదయ భావశ్రీమంతుడు – డా. బద్రి పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీశ్రీ – అభ్యుదయ భావశ్రీమంతుడు – డా. బద్రి పీర్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • ప్రముఖ తెలుగు కవి, హేతువాది, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీ అనగా శ్రీరంగం శ్రీనివాసరావు 1910లో ఏప్రిల్ 30న విశాఖపట్నంలో…
  • 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రభావవంతమైన మహాకవి అయిన శ్రీ శ్రీ అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా పరిగణించబడ్డారు.
  • తను రాసిన 'మహాప్రస్థానం' కావ్యం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగ అభ్యుదయ కవిత్వానికి దిక్సూచిగా శ్రమజీవుల కష్టాలను, సామాజిక మార్పును ప్రతిబింబిస్తుంది.

ప్రముఖ తెలుగు కవి, హేతువాది, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీ అనగా శ్రీరంగం శ్రీనివాసరావు 1910లో ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు. 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రభావవంతమైన మహాకవి అయిన శ్రీ శ్రీ అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా పరిగణించబడ్డారు. తను రాసిన ‘మహాప్రస్థానం’ కావ్యం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగ అభ్యుదయ కవిత్వానికి దిక్సూచిగా శ్రమజీవుల కష్టాలను, సామాజిక మార్పును ప్రతిబింబిస్తుంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇది ఒక విప్లవాత్మక కవితా సంకలనం. ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు తెలుగు కవిత్వ గమనాన్ని మార్చిన ఒక గొప్ప భావప్రవాహం అని చెప్ప వచ్చు. సామాన్యుడి వాడుక భాషలో కవిత్వం రాసి విప్లవం సృష్టించారు శ్రీశ్రీ. కవి గానే కాకుండా గొప్ప సినీ గేయ రచయితగా కూడా అనేక ప్రజాదరణ పొందిన పాటలు రాశారు. ఖడ్గసృష్టి, మరో ప్రస్థానం, మరియు తన ఆత్మకథ ‘అనంతం’ ఆయన ఇతర ముఖ్య రచనలు. నేడు శ్రీ శ్రీ జయంతి సందర్భంగా ఆయనకు ఈ కవితా నామాక్షరాభిషేకం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*మ* మరో ప్రపంచం పిలుపుకు ఆరాధ్యుడు
*హా* హారతి సమాజాకృతికి సులక్షణ విశ్లేషకుడు
*క* కవికుల వినీలాకాశంలో పరిపూర్ణ చంద్రుడు
*వి* విలువలతో కవితాత్మక విశ్వానికి మెరుగులద్దిన

*శ్రీ* శ్రీమంతుడు అభ్యుదయ భావ సంపన్నుడు
*రం* రంగం ఏదైనా రాణింపుకు రహదారుడు
*గం* ఘంటా పథంగా ధ్వనించే విప్లవభావకుడు

*శ్రీ* శ్రీనివాసం కన్నా జననివాసం పై దృష్టి పెట్టి
*ని* నిజానిజాలు సామాజిక అసమానతలు చూపెట్టి
*వా* వాక్కు భావవ్యక్తీకరణ హక్కు అని ప్రజాకవిగా
*స* సరళ మైన భావగీతాల వైజ్ఞానిక రచయితగా
*రా* రాణించిన రసమయ శ్రోత హృదయచక్రవర్తి
*వు* ఉదయించే సూర్యభానుడిలా భావోత్పాదకుడు

*జ* జనరంజక శ్రామిక సాహిత్య సంపాదకుడు
*యం* యాంత్రిక జీవనంలో వివేక మాంత్రికుడిగ
*తి* తిరుగులేని వెలుగుల విప్లవ భావ శ్రీమంతుడు
ప్రజా హృదయంలో నిత్య స్థిర స్థానీయుడు స్వర్గీయ శ్రీ శ్రీ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment

Your email address will not be published. Required fields are marked *