వార్త ముఖ్యాంశాలు
- సముద్రతీర అందాలు..
- ఆకట్టుకున్న ఆతిథ్యం 80 మందితో సాగిన ఉల్లాసభరిత పర్యటన టీమ్వర్క్తో రెట్టింపైన ఆనందం అనుభవాలు పంచుకున్న పాలకూరు మునికుమార్ దంపతులు పున్నమి న్యూస్: ప్రకృతి అందాలు, సముద్రతీర సోయగాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య సాగిన శ్రీలంక పర్యటన మధురానుభూతిని మిగిల్చిందని పాలకూరు మునికుమార్ దంపతులు తెలిపారు.
- భారత్ నుంచి 80 మంది సభ్యులతో వెళ్లిన పర్యాటక బృందంలో తాము పాల్గొన్నట్లు చెప్పారు.
సముద్రతీర అందాలు.. ఆకట్టుకున్న ఆతిథ్యం
80 మందితో సాగిన ఉల్లాసభరిత పర్యటన
టీమ్వర్క్తో రెట్టింపైన ఆనందం
అనుభవాలు పంచుకున్న పాలకూరు మునికుమార్ దంపతులు
పున్నమి న్యూస్: ప్రకృతి అందాలు, సముద్రతీర సోయగాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య సాగిన శ్రీలంక పర్యటన మధురానుభూతిని మిగిల్చిందని పాలకూరు మునికుమార్ దంపతులు తెలిపారు. భారత్ నుంచి 80 మంది సభ్యులతో వెళ్లిన పర్యాటక బృందంలో తాము పాల్గొన్నట్లు చెప్పారు. ముఖ్యంగా బెంటోటా ప్రాంతంలోని ప్రకృతి అందాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.
సముద్రతీరం పక్కనే రైలు మార్గం, రహదారి కనిపించే దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద విశేషాలను తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపించిందని వివరించారు. బస చేసిన ప్రాంతాల్లో వసతులు, ఆతిథ్యం బాగున్నాయని, కేరళ వంటకాలను గుర్తుచేసే ఆహార పదార్థాలు, ముఖ్యంగా దోసె రుచి ఆకట్టుకున్నాయని తెలిపారు.
ప్రయాణించిన మార్గాల్లో రహదారులు బాగున్నాయని, హారన్ల మోత లేకుండా ప్రశాంతంగా సాగిన ప్రయాణం నచ్చిందన్నారు.
పర్యటనలో ప్రత్యేకత బృంద సభ్యుల మధ్య కనిపించిన ఐక్యతేనని మునికుమార్ దంపతులు పేర్కొన్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ, సరదాగా గడిపిన క్షణాలు ఆనందాన్ని రెట్టింపు చేశాయన్నారు. సమష్టి సహకారం, స్నేహపూర్వక వాతావరణం పర్యటనను మరింత ప్రత్యేకంగా మార్చాయని తెలిపారు. బృంద సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రీలంక పర్యటన జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు.