Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

శ్రీరామ్ ఫైనాన్స్ అద్వర్యంలో 100 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీరామ్ ఫైనాన్స్ అద్వర్యంలో 100 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • మోటార్ వెహికల్స్,ఆటోలు నడుపుతూ కుటుంబాలను పోషిస్తున్న కార్మికుల పిల్లల చదువులకు ఆర్థిక చేయూత అందించేందుకు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ముందుకు వచ్చింది.
  • సంస్థ కాకినాడ మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో కాకినాడ టౌన్, రూరల్ ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు.సోమవారం కాకినాడ మెయిన్ బ్రాంచ్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్, ఆటో కార్మికుల పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందించారు.
  • 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4,000 నుంచి రూ.5,000 వరకు స్కాలర్‌షిప్‌ల రూపంలో ఆర్థిక సాయం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

మోటార్ వెహికల్స్,ఆటోలు నడుపుతూ కుటుంబాలను పోషిస్తున్న కార్మికుల పిల్లల చదువులకు ఆర్థిక చేయూత అందించేందుకు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. సంస్థ కాకినాడ మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో కాకినాడ టౌన్, రూరల్ ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు.సోమవారం కాకినాడ మెయిన్ బ్రాంచ్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్, ఆటో కార్మికుల పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4,000 నుంచి రూ.5,000 వరకు స్కాలర్‌షిప్‌ల రూపంలో ఆర్థిక సాయం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్మిక కుటుంబాలకు విద్యాపరంగా అండగా నిలవడంతో పాటు వారి పిల్లల చదువులకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా లారీ యూనియన్ ప్రెసిడెంట్ గూడవల్లి మృత్యుంజయరావు (ముత్యం), వారపు రోడ్ వెన్స్ యూనియన్ ప్రెసిడెంట్ చొక్కా నానాజీ, మినీ గూడ్స్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఎలుగుబంటి వెంకటరమణతో పాటు శ్రీరామ్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *