Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీనివాస్ కి ఎంపదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు ✨ మిత్రులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • పెరగనున్న జిడిపి వృద్ధి రేటు-బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి-మార్కాపురం:_గాంధీ జయంతి సందర్భంగా కరవుసీమ రాయలసీమను రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం సంతోషకరమైన విషయమని బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్…

పెరగనున్న జిడిపి వృద్ధి రేటు-బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి-మార్కాపురం:_గాంధీ జయంతి సందర్భంగా కరవుసీమ రాయలసీమను రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం సంతోషకరమైన విషయమని బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.రాయలసీమలోని కరవు పరిస్థితులు,రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అర్థం చేసుకుని,ప్రాంత సమగ్రాభివృద్ధికి దూరదృష్టితో ముందడుగు వేయడం అభినందనీయమన్నారు.రూ.లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమ ఉద్యాన హబ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం ద్వారా రాయలసీమ వ్యవసాయ రంగంలో నూతన శకం ప్రారంభమవుతుందని ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.ఉద్యాన పంటలకు అనుకూలమైన రాయలసీమ భౌగోళిక పరిస్థితులను సద్వినియోగం చేసుకుని,ఆధునిక సాంకేతికత,సాగునీటి వసతులు,శీతల గిడ్డంగులు,ప్రాసెసింగ్ యూనిట్లు,మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తే రైతులకు మరింత మెరుగైన ఆదాయ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.ఈ ప్రాజెక్టు ద్వారా రైతుల ఉత్పత్తులకు విలువ ఆధారిత మార్కెట్ కల్పించడంతో పాటు,వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుందని,యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.రాయలసీమను కేవలం కరవు ప్రాంతంగా కాకుండా దేశానికి,ప్రపంచానికి ఉద్యాన ఉత్పత్తులను అందించే వ్యవసాయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ నిర్ణయం కీలకమైన అడుగుగా నిలుస్తుందని ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.రైతుల సంక్షేమం,ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రాయలసీమలో పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకురావాలనే ప్రభుత్వ సంకల్పం సాకారమైతే ఈ ప్రాంత ఆర్థిక,సామాజిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా ఏపీలో ముఖ్యంగా రాయలసీమలో జిడిపి వృద్ధి రేటు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రా రెడ్డి అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *