*తెలుగుదేశం పార్టీని వీడి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ పాలడుగు జ్యోత్స్నా దుర్గాప్రసాద్ దంపతులు.*
*పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.*
*చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మరియు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు కుటిల ప్రవర్తన తీరు నచ్చక వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపిన పాలడుగు దుర్గాప్రసాద్ దంపతులు.*
*పాలడుగు దుర్గాప్రసాద్ దంపతుల చేరికతో స్థానికంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం చేకూరిందని తెలిపిన జోగి రమేష్ గారు.*
ది.18/10.
ఇబ్రహీంపట్నం/ఎన్టీఆర్ జిల్లా – ఈ రోజు ఉదయం జోగి రమేష్ గారి కార్యాలయంలో ఇబ్రహీంపట్నం మండల మాజీ ఎంపీపీ పాలడుగు జ్యోత్స్నా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గాప్రసాద్ గారి దంపతులు తెలుగుదేశం పార్టీని వీడి
*మాజీ మంత్రివర్యులు,*
*మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త*
*శ్రీ జోగి రమేష్ గారి* సమక్షంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన జోగి రమేష్ గారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

