Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

వైభవంగా శనేశ్వర స్వామికి శ్రావణ అష్టమి తిలతైలా అభిషేక పూజలు…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వైభవంగా శనేశ్వర స్వామికి శ్రావణ అష్టమి తిలతైలా అభిషేక పూజలు…

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ విశ్వవసు సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం శనివారం అష్టమినాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శనేశ్వర స్వామికి భక్తులచే తిల తైల అభిషేక,అర్చన, తదియ ప్రత్యేక పూజలు,అభిషేకలు వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి.
  • శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శని వారం శ్రావణ అష్టమి తిథి నాడు ప్రత్యేకంగా తిల తైల అభిషేకాల పూజలు నిర్వహించారు.
  • ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠంవిశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ శ్రావణమాసంలో భక్తి పూర్వకంగా స్వామివారిని కొలచడం ఎంతో విశేష ఫలితం అన్నారు.భక్తులు ప్రతి మాసంలో శనివారం నాడు అష్టమి,నవమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిథులు ఉన్న రోజు శనేశ్వర స్వామిని పూజించిన విశేష ఫలితంఉంటుందన్నారు.

శ్రీ విశ్వవసు సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం శనివారం అష్టమినాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శనేశ్వర స్వామికి భక్తులచే తిల తైల అభిషేక,అర్చన, తదియ ప్రత్యేక పూజలు,అభిషేకలు వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శని వారం శ్రావణ అష్టమి తిథి నాడు ప్రత్యేకంగా తిల తైల అభిషేకాల పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠంవిశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ శ్రావణమాసంలో భక్తి పూర్వకంగా స్వామివారిని కొలచడం ఎంతో విశేష ఫలితం అన్నారు.భక్తులు ప్రతి మాసంలో శనివారం నాడు అష్టమి,నవమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిథులు ఉన్న రోజు శనేశ్వర స్వామిని పూజించిన విశేష ఫలితంఉంటుందన్నారు. ఇక్కడ గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మ సూత్రం గల పరమశివునికి ఈరోజు భక్తులచే సామూహిక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకపూజలు, అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు జమ్మి చెట్టుకు19 ప్రదక్షణలు వేదమంత్రచరణల మధ్య చేశారు.గణపతి, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు భక్తులచే నిర్వహించారు.అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, కమిటీ సభ్యులు కేంచే రాజేష్ ప్రభాకరచారి, పుల్లయ్య,వీర శేఖర్, శ్రీకాంత్ రెడ్డి,ఆలయ ఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమమహేశ్వర్,సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *