వార్త ముఖ్యాంశాలు
- వైఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 4 ( పున్నమి ప్రశ్నలు) వెంకటాచలం మండల కేంద్రంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు.
- సర్ ప్రక్రియలో వైకాపా మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు అధికారులు, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు గురవుతున్నారని ఆరోపించారు.
- అర్హులైన వారికి నోటీసులు ఇస్తూ, టీడీపీ మద్దతుదారుల విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
వైఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 4 ( పున్నమి ప్రశ్నలు)
వెంకటాచలం మండల కేంద్రంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. సర్ ప్రక్రియలో వైకాపా మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు అధికారులు, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు గురవుతున్నారని ఆరోపించారు. అర్హులైన వారికి నోటీసులు ఇస్తూ, టీడీపీ మద్దతుదారుల విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైకాపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని భూములు, ప్లాట్లు, పట్టాల రద్దుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కాకుటూరు శివాలయం భూముల విషయంలో సోమిరెడ్డికి సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రవి మృతిపై సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.