వార్త ముఖ్యాంశాలు
- కృష్ణా జిల్లాలో మొంథా తుపాను వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్న సందర్భంలో, ఆయన కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.
- ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్ లోని కొన్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.
- ప్రమాదం కారణంగా అక్కడ కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కృష్ణా జిల్లాలో మొంథా తుపాను వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్న సందర్భంలో, ఆయన కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.
ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్ లోని కొన్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం కారణంగా అక్కడ కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇదిలాఉంటే… పర్యటన మార్గమంతా వైసీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ కి ఘన స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు, పూలు చల్లుతూ ఆహ్వానించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్ నుంచి పామర్రు నియోజకవర్గంలోని గోపువానిపాలెం వరకు జగన్ పర్యటన కొనసాగింది. కల్లుగీత కార్మికులు ఆయనను కలసి తమ సమస్యలను వివరించారు.
ఇక భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు పర్యటనపై ఆంక్షలు విధించారు. కేవలం 500 మంది, 10 వాహనాలకే అనుమతి ఇచ్చారు. ద్విచక్ర వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, గ్రామ, మండల నాయకులకు పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు జారీ చేశారు.