Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వృద్ధాప్యం ఎవరికి శాపం కారాదు. న్యాయ మూర్తి పద్మశ్రీ..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వృద్ధాప్యం ఎవ్వరికీ శాపం కారాదని ఆ పరిస్థితులను సృష్టించిన వారు ఆ తర్వాత వృద్ధులు కాకపోరనే విషయం గుర్తించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మశ్రీ కోరారు.
నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ,జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ గౌరవనీయులైన వై జె పద్మశ్రీ ఆధ్వర్యంలో కొత్తూరు నందున్న నెహ్రూభారతి వృద్ధుల ఆశ్రమం నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు .ఈ సదస్సులో జడ్జి వై జె పద్మశ్రీ వృద్ధులను ఉద్దేశించి తల్లిదండ్రులను కుటుంబంలోని ఇతర వయోవృద్ధులను వృద్యాప్యంలో నిర్లక్ష్యం చేయడం హేయకరమైన విషయం అని ఆవేదన వ్యక్తంచేశారు.బిడ్డలను పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వృద్ధులను నిర్లక్ష్యం చేయటం ఇంటి నుండి బయటకు గెంటి వేయడం న్యాయం కాదని అన్నారు.. వృద్ధాప్యంలో ఇలాంటి వారి రక్షణ కోసం 2007 సంవత్సరంలో తల్లిదండ్రుల సీనియర్ సిటిజెన్ల పోషణ సంక్షేమ చట్టం అమలులోకి వచ్చిందని, తల్లిదండ్రుల పోషణ భారం వారి బిడ్డలు మనుమలు, మనుమరాలు లేదా వారి నుండి ఆస్తులను పొందే అవకాశం ఉన్న బంధువులందరిదీ అని తెలిపినారు. అలాగే ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ లేని వారికి తెలిపితే అధికారులకు తెలిపి మీకు వచ్చేటట్లు చేస్తామని తెలిపినారు అలాగే వాళ్లకు అందుతున్న భోజనం వసతులు వసతి గృహం బాత్రూమ్స్ వైద్య సదుపాయం గురించి అన్ని విషయాలు వివరంగా అడిగి తెలుసుకున్నారు తదుపరి వృద్ధులకు అరటి పండ్లు పంచినారు ఈ కార్యక్రమంలో మేనేజర్ షాహిద్ గారలోక్ అదాలత్ సిబ్బంది పేరా లీగల్ వాలంటరీ పెంచల నరసయ్య తదితరులు పాల్గొన్నారు..

వృద్ధాప్యం ఎవరికి శాపం కారాదు. న్యాయ మూర్తి పద్మశ్రీ..

వృద్ధాప్యం ఎవరికి శాపం కారాదు. న్యాయ మూర్తి పద్మశ్రీ..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *