Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు నిరంతరము విద్యుత్తు ఆటంకం లేకుండా చూడాలి. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రజలకు నిరంతరము విద్యుత్తు ఆటంకం లేకుండా చూడాలి. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
Punnami editorial illustration

వార్త ముఖ్యాంశాలు

  • పి.గన్నవరం పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10.డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా,పి.
  • గన్నవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన సేవా సేతు అభియాన్’కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని,ప్రతి…

పి.గన్నవరం పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,పి. గన్నవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన సేవా సేతు అభియాన్’కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని,ప్రతి ఇంటిపై రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.పి. గన్నవరం నియోజకవర్గంలో నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని,ప్రజల అర్జీలపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *