Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నం పరిశుభ్రతకు షీ టీమ్స్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • "విశాఖ నగర పరిశుభ్రతకు (SHE TEAMS) షీ టీమ్స్ నిరంతర నిఘా."* నగర పరిశుభ్రత, సుందరీకరణ, అభివృద్ధే ప్రాధాన్యంగా జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ.* * బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలను పారవేస్తే కఠిన చర్యలు, జరిమానాలు.* * పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కు ప్రజా సహకారమే ముఖ్యభూమిక.-…
  • విశాఖ నగర పరిశుభ్రతకు, పర్యావరణానికి, సుందరీకరణకు, ఆహ్లాద వాతావరణానికి భంగం కలిగించేలా విశాఖ నగరంలో గల పలు వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాలు, నివాసితులు, సందర్శకులు బహిరంగ ప్రదేశాలలో, కాలువలలో, రోడ్లు, ఫుట్పాతులపై తమ వ్యర్థాలను పారవేస్తూ పరిసరాలను నిత్యం అశుభ్రపరచడం జీవీఎంసీ గమనిస్తూ వాటి నియంత్రణకు ఇప్పటికే…
  • అలాగే బీచ్ పరిసరాల్లోనున్న వ్యాపారస్తులు బీచ్ కు వచ్చే సందర్శకులకు, విహారయాత్రికులకు అవగాహన కల్పించకుండా బీచ్ తీర ప్రాంతాల్లో వ్యర్ధాలను పారవేసి పరిసరాలను, అశుభ్రపరుస్తూ సముద్ర జలాల కలుషితానికి కారకులవుతున్నారన్నారు.

“విశాఖ నగర పరిశుభ్రతకు (SHE TEAMS) షీ టీమ్స్ నిరంతర నిఘా.”* నగర పరిశుభ్రత, సుందరీకరణ, అభివృద్ధే ప్రాధాన్యంగా జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ.* * బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలను పారవేస్తే కఠిన చర్యలు, జరిమానాలు.* * పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కు ప్రజా సహకారమే ముఖ్యభూమిక.- జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.విశాఖపట్నం, అక్టోబర్ 15: విశాఖ నగర పరిశుభ్రత, సుందరీకరణ, అభివృద్ధే ప్రాధాన్యంగా మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలను పారవేసే వారిని గుర్తించేందుకు నగరంలో “షి” టీమ్స్ (Sanitation & Health Enforcement Teams) నిరంతర నిఘా తో పనిచేస్తున్నాయని, పరిసర పరిశుభ్రతకు, పర్యావరణ పరిరక్షణకు నగర ప్రజలు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. విశాఖ నగర పరిశుభ్రతకు, పర్యావరణానికి, సుందరీకరణకు, ఆహ్లాద వాతావరణానికి భంగం కలిగించేలా విశాఖ నగరంలో గల పలు వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాలు, నివాసితులు, సందర్శకులు బహిరంగ ప్రదేశాలలో, కాలువలలో, రోడ్లు, ఫుట్పాతులపై తమ వ్యర్థాలను పారవేస్తూ పరిసరాలను నిత్యం అశుభ్రపరచడం జీవీఎంసీ గమనిస్తూ వాటి నియంత్రణకు ఇప్పటికే ఏర్పాటు చేసిన” షి టీమ్స్” ద్వారా ప్రత్యేక నిఘాను నగరమంతా ఏర్పాటు చేశామన్నారు. అలాగే బీచ్ పరిసరాల్లోనున్న వ్యాపారస్తులు బీచ్ కు వచ్చే సందర్శకులకు, విహారయాత్రికులకు అవగాహన కల్పించకుండా బీచ్ తీర ప్రాంతాల్లో వ్యర్ధాలను పారవేసి పరిసరాలను, అశుభ్రపరుస్తూ సముద్ర జలాల కలుషితానికి కారకులవుతున్నారన్నారు. అందుకే జీవీఎంసీ నగరంలో ఏర్పాటుచేసిన షీ టీమ్స్ నిరంతర నిఘా ద్వారా అతిక్రమించి వ్యర్ధాలను పారవేసే వ్యాపారస్తులను, వాణిజ్యసముదాయాలను గుర్తించి 1000/- రూపాయలు జరిమానా తో పాటు వారి వ్యాపార లైసెన్సులను రద్దు చేసే ప్రక్రియను, అలాగే కాలనీలలో, రోడ్లపై , బహిరంగ ప్రదేశాలలో, కాలువలలో, ఫుట్పాతులపై వ్యర్ధాలు పారవేసే వారిపై 500/- రూపాయలు జరిమానా విధింపు ప్రక్రియను చేపట్టామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దిశగా నగరంలో గల పలు హోటల్లు, రెస్టారెంట్లు, ఆహారం విక్రయించే స్టాళ్లు, వంటశాలలు పై జీవీఎంసీ షీ టీమ్స్ తనిఖీలు నిర్వహించి అపరిశుభ్రమైన ఆహారాన్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను స్వాధీన పరుచుకుని జరిమానాలను విధించి, అతిక్రమించిన వ్యాపారాల లైసెన్సులను కూడా రద్దు చేయడం ఇప్పటికే జరుగుతోందన్నారు. ఆ దిశగా నగర పరిసరాల పరిశుభ్రతను మరింత పటిష్టపరిచేందుకు ఈ షీ టీమ్స్ నగరంలో నిరంతర నిఘా తో పరిశీలిస్తున్నాయన్నారు.విశాఖ నగరంలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాలు జరుగబోవు నేపథ్యంలో మహా విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తూ…, సుందరంగా, పచ్చదనం, విద్యుత్ కాంతులతో అందరినీ ఆకర్షించేలా తీర్చిదిద్దే కార్యక్రమాలను జీవీఎంసీ పూర్తి చేస్తోందన్నారు.కాబట్టి, వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాల వారు, కాలనీవాసులు, నివాసితులు తమ వద్ద రోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో, రోడ్లపై, కాలువలపై ఫుట్పాతులపై పారవేయకుండా, జరిమానాలుతో వ్యాపార లైసెన్సుల రద్దులకు గురికాకుండా రోజు మీ వద్దకు వచ్చే జీవీఎంసీ వాహనాలకు వ్యర్థాలను వేరు చేసి అందించాలని, మన విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తూ సుందరంగా తీర్చిదిద్దుతూ అతిధులను, పర్యాటకులను, విదేశీయులను, విహారయాత్రికులను ఆకర్షించేలా జీవీఎంసీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు, పరిసరాల పరిశుభ్రతకు ,పర్యావరణ పరిరక్షణకు నగర ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *