Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విశాఖపట్నం జూపార్క్ సమీపంలో పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదం గురువారం ఉదయం చోటుచేసుకుంది.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ (జూపార్క్) సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది విశాఖ నగరం నుంచి గుడిలోవ వైపు వెళ్తున్న పోలీసు ఎస్కార్ట్ వాహనాన్ని, ఎదురుగా మధురవాడ వైపు నుంచి వస్తున్న ఒక లారీ అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది గుడిలోవలో విధుల్లో ఉన్న ఇతర సిబ్బందిని రిలీవ్ చేసి, అక్కడ జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఏఆర్ (AR) కానిస్టేబుళ్లు ఎస్కార్ట్ వాహనంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు గాయ పడ్డారు వీరిలో ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా, ఒక కానిస్టేబుల్‌కు కాలు విరిగి తీవ్రంగా గాయపడి నట్లు తోటి సిబ్బంది ధృవీకరించారు బాధి తులను ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారికి అక్కడ వైద్య సేవలు అందుతున్నాయి ప్రమాదం కారణంగా పోలీస్ వాహనం పూర్తిగా దెబ్బతిని రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంత రాయం కలిగింది ఆరిలోవ పోలీసులు వెంటనే స్పందించి క్రేన్ సహాయంతో దెబ్బతిన్న వాహనాన్ని పక్కకు తొలగించి వాహన రాకపోకలను క్రమబద్ధీ కరించారు ఈ ప్రమాదంపై ఆరిలోవ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పై దర్యాప్తు ప్రారంభించారు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *