Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

వినాయక చవితి వేడుకల్లో శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వినాయక చవితి వేడుకల్లో శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు

వార్త ముఖ్యాంశాలు

  • గాజువాక,పున్నమి ప్రతినిధి ,సెప్టెంబర్ 28: 75వ వార్డు శెట్టిబలిజ వీధిలో శ్రీ పెంటమాంబ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సిద్ధి వినాయక పూజా మహోత్సవాల్లో గాజువాక నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన…
  • కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించారు.
  • యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, బాగా చదువుకుని ఉన్నత స్థానాలను సాధించి తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 75వ వార్డు మాజీ కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు పులి లక్ష్మిబాయి, గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ…

గాజువాక,పున్నమి ప్రతినిధి ,సెప్టెంబర్ 28:

75వ వార్డు శెట్టిబలిజ వీధిలో శ్రీ పెంటమాంబ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సిద్ధి వినాయక పూజా మహోత్సవాల్లో గాజువాక నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా కలిసి జరుపుకునే వినాయక చవితి పండుగ పిల్లలకు మంచి విషయాలు నేర్పుతుందని అన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, బాగా చదువుకుని ఉన్నత స్థానాలను సాధించి తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 75వ వార్డు మాజీ కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు పులి లక్ష్మిబాయి, గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి, ఇతర నాయకులు, స్థానిక పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *