Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విద్యార్థుల ప్రతిభకు అరుదైన గుర్తింపు…. . నాంది ఫౌండేషన్ -నాన్ కాళీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విద్యార్థుల ప్రతిభకు అరుదైన గుర్తింపు…. . నాంది ఫౌండేషన్ -నాన్ కాళీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేత

వార్త ముఖ్యాంశాలు

  • 🎒 చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు 8 బ్యాగులు, 12 ట్రోఫీలు అందజేత విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, అక్టోబర్ 8 (పున్నమి ప్రతినిధి) :: చిన్నారుల ప్రతిభను గుర్తించి, వారిలో దాగి ఉన్న నైపుణ్యాలకు ప్రోత్సాహం అందిస్తే వారి భవిష్యత్తుకు మరింత బలమైన పునాది ఏర్పడుతుంది.
  • ఈ ఆలోచనకు అద్దం పట్టేలా నాంది ఫౌండేషన్ అండ్ నాన్హీ కలి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన మేడమ్స్ విద్యార్థులతో వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.

🎒 చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు 8 బ్యాగులు, 12 ట్రోఫీలు అందజేత

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, అక్టోబర్ 8 (పున్నమి ప్రతినిధి) ::

చిన్నారుల ప్రతిభను గుర్తించి, వారిలో దాగి ఉన్న నైపుణ్యాలకు ప్రోత్సాహం అందిస్తే వారి భవిష్యత్తుకు మరింత బలమైన పునాది ఏర్పడుతుంది. ఈ ఆలోచనకు అద్దం పట్టేలా నాంది ఫౌండేషన్ అండ్ నాన్హీ కలి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన మేడమ్స్ విద్యార్థులతో వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. తరగతి గదిలో ఉత్సాహంగా పాల్గొని, చురుకుదనం, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు.

విద్యార్థుల కృషికి గుర్తింపుగా 8 బ్యాగులు, 12 ట్రోఫీలను బహుమతులుగా అందజేశారు. జీసీడీఓ శ్రీమతి శ్రీదేవి గారి చేతుల మీదుగా బహుమతులు అందుకున్న విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ ప్రతిభకు గుర్తింపు లభించడంతో చిన్నారుల్లో మరింత ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపించింది.

ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపల్ శ్రీమతి దొండా చంద్రకళ గారు, నాంది ఫౌండేషన్ ప్రతినిధి శ్రీమతి ఉమా గారు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

ఒక చిన్న బహుమతి… ఒక పెద్ద ప్రోత్సాహం… ఒక చిన్నారి భవిష్యత్తుకు గొప్ప నమ్మకం అనే విధంగా ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నైపుణ్యాలు మరింతగా వికసిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *